Sunday, 3 June 2018

భారత మాతకు నీరాజనాలు పుస్తకం ఆవిష్కరణ


Patriots Welfare Society, Mancherial
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల

" భారతమాతకు నీరాజనాలు " పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ సాహితి వేత్త తుమ్మల మల్లారెడ్డి
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారు ముద్రించిన " భారత మాతకు నీరాజనాలు " పుస్తకం ను సంఘ అధ్యక్షులు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారి గృహంలో ప్రముఖ సాహితి వేత్త తుమ్మల మల్లారెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ పుస్తకం " దేశభక్తి గీతాల, రచనల పోటీలు 2017 "లో వచ్చిన గీతాలు, కవితలతో ముద్రించడం జరిగింది. ఈ పుస్తకం లో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లోని 54 మంది కవులు రచించిన భారత మాత గీతాలు, కవితలు గలవు.
ఈ కార్యక్రమం లో సంఘ అధ్యక్షులు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ మేడ తిరుపతి, ట్రెజరర్ శీలం శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి,కవులు అల్లాడి శ్రీనివాస్, వేణు గోపాల్, బెల్లాల సుగుణాకర్, మహేందర్, సమ్మయ్య , పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశ భక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల