తేదీ 06-09-2020
దేశభక్తుల సంక్షేమ సంఘం , తెలంగాణ (మంచిర్యాల )
" పత్రిక ప్రకటన "
" రవీంద్రనాథ్ టాగోర్ పై జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం నిర్వహణ "
" రవీంద్రనాథ్ టాగోర్ జీవితం, సాహిత్యం పై " జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం " ను ఐదు సాహితీ సంస్థలు కలిసి నిర్వహించినట్టు కవి సమ్మేళన అధ్యక్షుడు మరియు దేశభక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షలు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు .
ఐదు సాహితీ సంఘాలు 1) దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల 2) శరత్ సాహితీ కళా స్రవంతి , కరీంనగర్ 3) ఉదయ సాహితి , కరీంనగర్ 4) భువన విజ్ఞాన సాహిత్య వేదిక , తెలంగాణ 5) ఉట్నూర్ సాహితి వేదిక, ఉట్నూర్ తలపెట్టిన " రవీంద్రనాథ్ టాగోర్ జయంతి వేడుకలు 2020 " కరోనా కారణంగా రద్దు కావడంతో ఈ ఆన్లైన్ కవి సమ్మేళనం నిర్వహించినట్టు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ జాతీయ అంతర్జాల కవి సమ్మేళనం ముఖ్య అతిధిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ శ్రీ దార్ల వెంకటేశ్వర్ రావ్ గారు పాల్గొన్నారు . వారు మాట్లాడుతూ ఠాగూర్ జీవితంపై కవి సమ్మేళనం నిర్వహించడం మంచి కార్యక్రమం అని , కవులు అందరిని కలుపుకు పోయే విశాల వేదిక అవసరం అని పేర్కొన్నారు. 5 సంఘాలు కలిసి కవి సమ్మేళనం నిర్వహించడం గొప్ప కార్యక్రమం అని అభినందించారు.
దేశాన్ని ప్రేమించడం, దేశ భౌగోళిక పరిస్థితులను ప్రేమించడం అనేది చర్చనీయా అంశం అని, అయితే దేశ భౌగోళిక పరిస్థితులను ప్రేమించలేని వారు దేశాన్ని ప్రేమించలేరని తెలిపారు. మన దేశం విస్తృత సాహిత్యం స్పృష్టించిందని రామాయణ, మహాభారతాలు అందులో భాగాలని , ఆ స్థాయిలో మళ్ళి సాహిత్యం ను రవీంద్రనాథ్ ఠాగోర్ గారు స్పృష్టించారని తెలిపారు.
దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలను కలుపుకుపోయే విధంగా రవీంద్రనాథ టాగోర్ గారు రచించిన జాతీయ గీతం " జన,గణ మన " ఉందని అందుకే దానిని జాతీయ గీతంగా ఆమోదించారని తెలిపారు. రవీంద్రనాథ్ టాగోర్ జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని , మాతృ భాషను విస్మరించకుండా పర భాషలు కూడా నేర్చుకోవాలని టాగోర్ జీవితం సూచిస్తున్నాడని తెలిపారు. మనకు ఉండే స్వేచ్ఛ ను యితరులు కోరుకుంటారని రవీంద్రనాథ్ టాగోర్ వారి సాహిత్యంలో సూచించారని తెలిపారు. టాగోర్ రాసిన నవలలో ఘోర నవల ప్రసిద్ధమైనది తెలిపారు. విశాల మానవుడు ఉద్బవించానలి టాగోర్ కోరుకున్నారని, భిన్న భాషలు దేశ సమైక్యతకు అవసరం అని వారు తెలిపారు. మాధుర్యం కవిత్వానికి ముఖ్యమని, కవిత్వంలో కవిత్వం మాత్రమే కనిపించాలని కవి కాదని అన్నారు. సంస్కృతీ అంటే ఎప్పటికప్పుడు సంస్కరించేబడేదని టాగోర్ పేర్కొన్నారని తెలిపారు.
ఈ కవి సమ్మేళనం కు విశిష్ట అతిధిగా ఢిల్లీ విశ్వవిద్యాలయం కు చెందిన డా. గంపా వెంకట రామయ్య గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ టాగోర్ సాహిత్యం గురించి మాట్లాడాలంటే అంత పరిజ్ఞానం ఉండాలని, కానీ సాహిత్య విద్యార్థిగా రవీంద్రుని కవితాలపై చర్చిస్తున్నాని తెలిపారు. రవీంద్రనాథ్ టాగోర్ రచనలు చాలా వరకు తెలుగులోకి అనువదించబడ్డాయని తెలిపారు. విశ్వసాహిత్యం, నేషనలిజం పేరుతొ వచ్చిన రెండు పత్రాలపై వారు మాట్లాడారు. విశ్వ సాహిత్యం విశ్వ శ్రేయస్సు ను కోరుతుందని, అది మాత్రమే సాహిత్యం అని పేర్కొన్నారు. ఈ భూభాగం ప్రపంచం అంతా కలిసి ఉన్న ఉన్న భాగమని ముక్కలు, ముక్కలు అయిన భాగం కాదని టాగోర్ అనే వారిని తెలిపారు. విశ్వసాహిత్యానికి అనువాదం చేయదగ్గ అర్హత, మరియు ప్రాంతానికి, కాలానికి అతీతంగా ఉండే అర్హత ఉండాలని తెలిపారు.
ఈ కవి సమ్మేళన గౌరవ అతిధులుగా సబ్బాని లక్ష్మి నారాయణ ( కరీంనగర్ ) , వైరాగ్యం ప్రభాకర్ ( కరీంనగర్ ) , గోస్కుల రమేష్ ( హుజురాబాద్ ) , జాదవ్ బంకట్ లాల్ ( ఉట్నూర్ ) వ్యవహరించారు.
ఆత్మీయ అతిధులుగా జై కిషన్ ఓఝా ( మంచిర్యాల ) , సంకెపల్లి నాగేంద్ర శర్మ ( కరీంనగర్ ), బి వి యెన్ శర్మ ( కరీంనగర్ ), మంచికట్ల శ్రీనివాస్ ( వరంగల్ ), కొండగుర్ల లక్ష్మయ్య ( ఉట్నూర్ ) వ్యవహరించారు.
ప్రత్యేక అతిధిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని కి చెందిన తెలుగు విభాగం అధిపతి తన్నీరు సురేష్ గారు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా కవులు పాల్గొన్నారు.
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.