Saturday, 14 July 2018

4 వ జాతీయ స్టాయి దేశభక్తి గీతాల, కవితల రచన పోటీలు 2018


PATRIOTS WELFARE SOCIETY
MANCHERIAL
Telangana State, INDIA ( Regd.no. 446/2014)
Face book group – PATRIOTS WELFARE SOCIETY

====================================================
దేశ భక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల

Date : 15-07-2018
4 వ జాతీయ స్టాయి
దేశభక్తి గీతాల, కవితల రచన పోటీలు  2018

దేశ భక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల వారు జూలై 15 నుంచి ఆగష్టు 15 వరకు నాలుగవ జాతీయ స్టాయి దేశ భక్తీ గీతాల, కవితల రచన పోటీలు నిర్వహిస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. తెలంగాణ , ఆంద్ర ప్రదేశ్ తో పాటు భారత దేశం లోని ఇతర తెలుగు మాట్లాడే ప్రాంతాల నుంచి , తెలుగు భాష అబిమానుల నుంచి , తెలుగు సాహిత్య ప్రియుల నుంచి దేశ భక్తీ గీతాలు, కవితలు ఆహ్వానిస్తున్నాము. 2015 నుంచి ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తున్నాం.

2015 లో వచ్చిన గీతాలను  ఈ పుస్తకం రూపం లో తయారు చేసి మా వెబ్ సైట్ నందు వుంచడం జరిగింది. 2015 లో జరిగిన పోటిలకు 61 గీతాలు వచ్చాయి .

2016 లో వచ్చిన గీతాలను “ దేశ భక్తీ గీతావళి   ” పేరుతొ పుస్తకం ముద్రించడం జరిగింది. 2016 లో 105 గీతాలు , 125 కవితలు వచ్చాయి.   
        2017 వచ్చిన గీతాలను 1.భరతమాతకు నీరాజనాలు అనే ముద్రిత పుస్తకం ౨. డా.బి.ఆర్.అంబేద్కర్ గీతాలు, కవితల E పుస్తకం తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరంలో 240 గీతాలు, కవితలు వచ్చాయి .

 ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ గీతాలు వస్తాయని ఆశిస్తున్నాం.

2018 పోటి అంశO :
 హిందూ  ముస్లింల ఐక్యత వర్దిలాల్లి

బహుమతులు : ( మొత్తం 10,000-00 )
ప్రథమ బహుమతి :  రూపాయలు మూడు   వేలు
ద్వితీయ బహుమతి : రూపాయలు రెండు   వేలు
తృతీయ బహుమతి : రూపాయలు వెయ్యి రూపాయలు
 ఎనిమిది   ప్రోత్సహాక బహుమతులు : ఒక్కక్కటి ఐదు వందల  రూపాయలు

తేదీలు :
ప్రారంభ తేది : జూలై 15,2017
ముగింపు తేది : ఆగష్టు15,2017

రచనలు పంపవలసిన చిరునామా :
1)   సూదిరెడ్డి నరేందర్ రెడ్డి,  ఇంటి. నెంబర్. 20-183/4 ,ఎడ్ల వాడ, కాలేజి రోడ్, మంచిర్యాల్ పిన్ : 504208  లేదా
3)   Whats app number 7386776361. Write with black pen and send in JPEG format only


షరతులు :
1)   గీతాలు, కవితలు అంశాలకు అనుగుణంగా ఉండాలి. గీతం గాని, కవిత గాని పూర్తిగా  అంశం నకు సంబంధించి మాత్రమే ఉండాలి.
2)   ఒక కవికి ఒక బహుమతి మాత్రమే. ఒక కవి  అంశం నకు ఒక గీతం, ఒక కవిత పంపవచ్చు. ప్రతి కవిత గీతం పై మీ పేరు, జిల్లా పేరు, రాష్ట్రము పేరు, చరవని సంఖ్య రాయాలి .
3)   పత్రిక ప్రకటనలకు స్పందించి వచ్చిన గీతాలు, కవితల పై సర్వ హక్కులు మాకు వుంటాయి .

4)   గీతాలు, కవితలు తెలుగు భాషలో ఉండాలి. సామాన్యులకు అర్ధమయ్యే భాషలోనే ఉండాలి.మీకు వీలయితే మీ కవితలు, గీతాలు ట్యూన్ చేసి మా మెయిల్ ఐ.డి. పంపండి. మా వెబ్ సైట్ లో ఉంచుతాము. ఆసక్తి వున్న వాళ్ళు వినవచ్చు. మీ గీతాలు ప్రజలలో దేశ భక్తిని పెంచడానికి తోడ్పడతాయి.
5)   ఇంతకు ముందు ఎన్నడు ముద్రితం కానీ, పుస్తక రూపంలో రాని రచనలను మాత్రమే పంపాలి
6)   మీ రచన క్రింద మీ పేరు, చిరునామా రాయాలి. రచనతో పాటు హామీపత్రం ఉండాలి.
7)   హామీ పత్రం లో రచయిత పేరు, చిరునామా, సెల్ నెంబర్, మెయిల్ ఐ.డి. రాయాలి.
ఈ గీతాల, కవితల హక్కులు మాకు ఇస్తున్నట్టు హామీ పత్రం రాయాలి.
8)  గీతాలు మొత్తం ఇరవై లైన్లు ఉండాలి   
9) కవితలు 30-40  లైన్లు ఉండాలి
10) గీతం, కవితలకు శిర్షిక ఉండాలి
11) చివరి తేదిని పొడగించే అవకాశం నిర్వాహకులకు గలదు.
12)  బహుమతుల నిర్ణయంలో నిర్వాహకులదే తుది నిర్ణయం
13) బహుమతులు సంఘం ఎర్పాటు చేసే కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది
14) ఈ పోటిలకు పంపబడిన గీతాలు, కవితలు అవి బహుమతి పొందిన, పొందక పోయిన, సర్వహక్కులు మా సంఘం నకు చెందుతాయి. 
15) ఇతరులు రచించిన గీతాలు, కవితలు పంపరాదు, ఒకవేళ పంపితే ఆ రచయితలకు, మా సంఘంనకు మీరే బాద్యులు.
16) డిక్లరేషన్ లేదా హమిపత్రం క్రింద ఇవ్వబడినది

నాణ్యమైన కవితలను పుస్తకం రూపంలో ముద్రించడం జరుగుతుంది. పుస్తక ముద్రణకు ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది. పుస్తకం కావలసిన వారు నగదును  క్రింది విదముగా చెల్లించాలి
అ ) Rs.100-00 చెక్కు “ PATRIOTS WELFARE SOCIETY ” అని రాసి కవితతో పంపాలి. చెక్కు వెనక మీ పేరు , సెల్ నెంబర్ రాయాలి లేదా
ఆ) Rs.100-00 D.D. ( Demand draft ) ను “ PATRIOTS WELFARE SOCIETY” పేరుపై MANCHERIAL  లో చెల్లుబాటు ఆయె విదంగా తీయాలి  డీ.డీ.వెనక మీ పేరు , సెల్ నెంబర్ రాయాలి  లేదా
ఈ ) Rs.100-00 Indian Postal Order ( I.P.O ) నుS.NARENDAR REDDY పేరుపై MANCHERIAL లో చెల్లుబాటు ఆయె విదంగా  తీసి  మాకు పంపించాలి.
పోస్టల్ ఆర్డర్ వెనక మీ పేరు , సెల్ నెంబర్ రాయాలి
ఒ) రూపాయలు 100-00 ను ONLINE TRANSFER ద్వార చెల్లించవచ్చు.
ACCOUNT NAME : PATRIOTS WELFARE SOCIETY
Account Number : 6239 206 4465
BANK : STATE BANK OF INDIA, GARMILLA
BRANCH CODE : 20744
IFSC CODE: SBIN0020744
 (IFSC Code లో వున్నవి మూడు  ZEROs , O అనే లెటర్స్ కావు )- Online లో పంపిన తర్వాత రెఫెరెన్సు నెంబర్ ను  మాకు పంపండి 

ప్రకటన జారి చేసిన వారు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు , దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
మరియు
అసిస్టెంట్ ప్రొఫెసర్, కామర్స్ విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల , మంచిర్యాల
వాట్స్ అప్ నెంబర్ 7386776361

================================================== 
  

DECLARATION
For PATRIOTS WELARE SOCIETY, MANCHERIAL
Patriotic Songs, Poetry Competitons 2018

గీతం పేరు / కవిత పేరు :
రచయిత పేరు :
చిరునామా :
సెల్ నెంబర్ :
మెయిల్ ఐ.డి.
వయసు :
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారు నిర్వహిస్తున్న “  దేశభక్తి గీతాల, కవితల రచన పోటీలు 2018  ”  కు పంపిస్తున్న ఈ గీతం / కవిత నేను స్వయంగా రచించింది. ఏ మూలం నుంచి అనువదించింది కాదు. ఎవరి రచనలకు కాపీ కాదు. ఈ గీతం/ కవిత యొక్క సర్వహక్కులు “  దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల ” వారికి చెందుతాయి.

రచయిత సంతకం
తేది : __________

Sunday, 3 June 2018

భారత మాతకు నీరాజనాలు పుస్తకం ఆవిష్కరణ


Patriots Welfare Society, Mancherial
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల

" భారతమాతకు నీరాజనాలు " పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ సాహితి వేత్త తుమ్మల మల్లారెడ్డి
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారు ముద్రించిన " భారత మాతకు నీరాజనాలు " పుస్తకం ను సంఘ అధ్యక్షులు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారి గృహంలో ప్రముఖ సాహితి వేత్త తుమ్మల మల్లారెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ పుస్తకం " దేశభక్తి గీతాల, రచనల పోటీలు 2017 "లో వచ్చిన గీతాలు, కవితలతో ముద్రించడం జరిగింది. ఈ పుస్తకం లో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లోని 54 మంది కవులు రచించిన భారత మాత గీతాలు, కవితలు గలవు.
ఈ కార్యక్రమం లో సంఘ అధ్యక్షులు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ మేడ తిరుపతి, ట్రెజరర్ శీలం శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి,కవులు అల్లాడి శ్రీనివాస్, వేణు గోపాల్, బెల్లాల సుగుణాకర్, మహేందర్, సమ్మయ్య , పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశ భక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల




Monday, 9 April 2018

" SONGS AND POETRY BOOK ON DR.B.R.AMBEDKAR " RELEASE PHOTOS

డా . బి.ఆర్ .అంబేద్కర్ గీతాల, కవితల పుస్తక ఆవిష్కరణ
తేది : April 9,2018
Photos







Wednesday, 31 January 2018

JAWANO KA JOHAR KAVI SAMMELAN PRESS COVERAGE

Press coverage of Poetry coference on  SALUTE TO INDIAN MARTYRED SOLDIERS

SAKSHI DAILY NEWS PAPER DATE JANUARY 29,2018


EENADU DAILY NEWS PAPER, MANCHERIAL DISTRICT , TELANGANA STATE
JANUARY 29,2018


NAMASTE TELANGANA DAILY NEWS PAPER JANUARY 29,2018


ANDRA JYOTHI DAILY NEWS PAPER DATE JANUARY 29,2018


AMAR JAWAN KI JOHAR

అంశం :         “ అమర జవాన్లకు అక్షరాంజలి  ”
తేది:               జనవరి    28,2018 ( ఆదివారం )
 సమయం :    ఉదయం  10 a.m. -1 p.m.
స్థలం :             ప్రభుత్వ డిగ్రీ కళాశాల , మంచిర్యాల

KAVI SAMMELANA DRUSHYALU










Tuesday, 23 January 2018

Patriotic poetry conference

Patriotic poetry conference on " Salutations to Martyred Indian Soldiers " We, Patriots Welfare Society Mancherial are conducting Patriotic poetry conference on " Salutations to Martyred Indian Soldiers" in Telugu language on January 28,2018 in Govt Degree College, Mancherial. Our society was established in December 2014 to promote National Integration, National Unity, Nationalism and Patriotism in India. Since then we are conducting different programmes to promote n our objectives. Every year from July 15-August 15 we are conducting Patriotic Poetry and Songs Competition. We e-printed " Patriotic songs book 2015". In 2017 we printed our first paper back book " Desha Bhakti Geetavali " in Telugu. We hope to conduct these competition in Hindi and English in future. Sudireddy Narendar Reddy President Patriots Welfare Society, Mancherial www.patriotswelfaresociety.blogspot.com

Friday, 12 January 2018

దేశభక్తి కవిసమ్మేళనo – అంశం : “ అమర జవాన్లకు అక్షరాంజలి ”

దేశభక్తి కవిసమ్మేళనo – అంశం :         “ అమర జవాన్లకు అక్షరాంజలి  ”


దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
తెలంగాణ రాష్ట్రము
PATRIOTS WELFARE SOCIETY, MANCHERIAL
Telangana State, INDIA ( Regd.no.446/2014)
( www.patriotswelfaresociety.blogspot.com )

మంచిర్యాల జిల్లా కవులకు ఇదే మా ఆహ్వానం. మా మొట్టమొదటి దేశభక్తి కవి సమ్మేళనంలో పాల్గొనండి. మీ దేశభక్తిని కవితా రూపంలో వినిపించండి.

అంశం :         “ అమర జవాన్లకు అక్షరాంజలి  ”
తేది:               జనవరి    28,2018 ( ఆదివారం )
 సమయం :    ఉదయం  10 a.m. -1 p.m.
స్థలం :             ప్రభుత్వ డిగ్రీ కళాశాల , మంచిర్యాల

        రిపబ్లిక్ దినోత్సవం ను పురస్కరించుకొని జవాన్ల  యొక్క సేవలను, త్యాగాలను పౌర సమాజం స్మరించడం ఎంతైనా అవసరం అనే ఉద్దేశ్యంతో ఈ కవి సమ్మేళనం ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశభక్తి కవి సమ్మేళనం లో అధిక సంఖ్యలో కవులు , సాహితి ప్రియులు పాల్గొని వారి అంతరంతరంగాలలో ఉన్న దేశభక్తిని కవిత రూపంలో తీసుకు వస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే కవులకు ప్రశంసా పత్రాలు అందించబడును. కవులు కూడా వారి కవిత యొక్క ప్రతిని మాకు అందించగలరు. వాటిని ఈ-పుస్తకం రూపంలో తీసుకు వస్తాము. ఈ కార్యక్రమoలో పాల్గొనే వారు సంప్రదించండి.
గమనిక : ప్రతి కవికి ౩-5 నిమిషాల సమయం యివ్వడం జరుగుతుంది. కవుల సంఖ్య ఆదారంగా సమయం ఉంటుoది.

సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు
సెల్ : 9440383277
Whastapp : 7386776361