Friday, 20 September 2019
Saturday, 7 September 2019
పత్రికా ప్రకటన.
పెద్దపల్లి జిల్లా స్థాయి కవి సమ్మేళనం
అంశం : అమర జవాన్లకు అక్షరాంజలి
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15, 2019
ఆదివారం ఉదయం 10 గంటల నుంచి " అమర జవాన్లకు అక్షరాంజలి " పేరుతో "
పెద్దపల్లి జిల్లా స్థాయి కవి సమ్మేళనం " నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్షుడు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి,
ప్రధాన కార్యదర్శి జై కిషన్ ఓఝా తెలిపారు.
ఈ కవి సమ్మేళనం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని లో నిర్వహించడం జరుగుతుంది.
సెప్టెంబర్ 18, 2016 జమ్మూకాశ్మీర్ ఉరి ప్రాంతంలో జరిగిన దాడిలో మరణించిన
సైనికులను స్మరిస్తూ ఈ కవి సమ్మేళనం ఉంటుందని తెలిపారు.
ఈ కవి సమ్మేళనం లో పాల్గొనే కవులకు ప్రశంసా పత్రాలు అందించడం జరుగుతుంది.
పాల్గొనే కవులు సంప్రదించండి
ఇట్లు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల
మంచిర్యాల జిల్లా స్థాయి కవి సమ్మేళనం
పత్రికా ప్రకటన. తేదీ : 04-09-2019
మంచిర్యాల జిల్లా స్థాయి కవి సమ్మేళనం
అంశం : తెలంగాణ విలీన వీరులకు, విమోచన వీరులకు జన జోహార్లు
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14, 2019 శనివారం ఉదయం 10 గంటల
నుంచి " తెలంగాణ విలీన వీరులకు, విమోచన వీరులకు జన జోహార్లు " పేరుతో " మంచిర్యాల జిల్లా స్థాయి
కవి సమ్మేళనం " నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్షుడు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి,
ప్రధాన కార్యదర్శి జై కిషన్ ఓఝా తెలిపారు.
ఈ కవి సమ్మేళనం అధ్యక్షుడు గృహం ఆదిత్య నిలయం, ఇంటి నెంబర్ 20-183/4, ఎడ్లవాడ, కాలేజ్ రోడ్డు ,
మంచిర్యాల లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కవి సమ్మేళనం లో పాల్గొనే కవులకు ప్రశంసా పత్రాలు
, జ్ఞాపికలు అందించడం జరుగుతుంది. పాల్గొనే కవులు సంప్రదించండి
ఇట్లు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల
===================================
Tuesday, 13 August 2019
Sunday, 11 August 2019
దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 4 వ సంచిక విడుదల
దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 4 వ సంచిక ( జూలై september 20 19 )
తేది : 11 -08 - 20 19 న
దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల వారి ౩ వ ముద్రిత పుస్తకం
" హిందూ , ముస్లింల ఐక్యత వర్దిల్లాలి " లో మంచిర్యాల కు చెందిన ప్రముఖ కవి బోనగిరి రాజిరెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చెయ్యడం జరిగింది.
సాహిత్య పత్రిక కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.
https://drive.google.com/file/d/1q_qp4HDI1JrqPOzWnbHyYNbhyQzL6oyt/view?usp=sharing
తేది : 11 -08 - 20 19 న
దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల వారి ౩ వ ముద్రిత పుస్తకం
" హిందూ , ముస్లింల ఐక్యత వర్దిల్లాలి " లో మంచిర్యాల కు చెందిన ప్రముఖ కవి బోనగిరి రాజిరెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చెయ్యడం జరిగింది.
సాహిత్య పత్రిక కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.
https://drive.google.com/file/d/1q_qp4HDI1JrqPOzWnbHyYNbhyQzL6oyt/view?usp=sharing
Monday, 10 June 2019
SHRI PADIMARRI VENKATA SUBBA RAO BIRTH ANNIVERSARY
పత్రిక ప్రకటన. ( తేదీ : జూన్ 9, 2019)
" భారత దేశం నా మాతృభూమి " ప్రతిజ్ఞ రచించిన తెలంగాణ వాసి పైడిమర్రి వెంకట సుబ్బారావు ను స్మరించుకున్న కవులు, ఉపాధ్యాయులు
జూన్ 10 న ప్రతిజ్ఞ రచయిత శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని ఈ రోజు దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమ సభను ఉద్దేశించి ప్రారంభ ప్రసంగం చేసిన సంఘ అధ్యక్షులు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ భారత దేశంలో జనగణమన, వందేమాతరం తర్వాత జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ గల్గినది ప్రతిజ్ఞ అని గుర్తు చేశారు. అటువంటి ప్రతిజ్ఞను రచించిన తెలంగాణ వాసి, నల్గొండ నివాసి తెలంగాణ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసారని పేర్కొన్నారు.
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు అప్పటి హైద్రాబాద్ రాష్ట్రంలో STO గా విధులు నిర్వహించారు. 1962 చైనా యుద్ధం సమయంలో విశాఖపట్నం లో విధులు నిరహిస్తున్నప్పుడు ప్రతిజ్ఞ రచించారు. దానిని కవి మిత్రులు తెన్నేటి విశ్వనాథం కు చూపించారు. వారి నుంచి విద్యాశాఖ మంత్రి Pv రాజు ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి చేరింది. 1963 లో పాఠ్య పుస్తకాలలో ప్రతిజ్ఞ అచ్చు అయింది. 1965 లో కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను ఆంగ్లంలో కి అనువదించి పాఠ్య పుస్తకాలలో ముద్రించింది. కానీ ఎక్కడ రచయిత పేరు ముద్రించలేదు
2015 లో తెలంగాణ ప్రభుత్వం రచయిత పేరును పాఠ్య పుస్తకాలలో ముద్రించింది. పైడిమర్రి మంచి రచయిత, బహుభాషావేత్త.ఆయన కాలభైరవుడు నవల, దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు లాంటి పద్యకావ్యాలు, బ్రహ్మచర్యం, గృహస్త జీవితం, స్త్రీ ధర్మం, తార, శ్రీమతి అనే నాటికలు రాసారు. వీరి పద్యాలు నల్గొండ కవుల సంచికలో ప్రచురితమైనవి. పైడిమర్రి 1971లో పదవి విరమణ పొంది ఆగస్ట్ 13, 1988 న మరణించారు.
కార్యక్రమం ముఖ్య అతిధిగా మంచిర్యాల రచయితల సంఘం అధ్యక్షుడు బొడ్డు మహేందర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ జాతీయ ప్రతిజ్ఞ ప్రజలలో దేశభక్తి ని పెంచుతుందని, అది రాసిన పైడిమర్రి సుబ్బారావు గారి జయంతి నిర్వహించడం చాల మంచి కార్యక్రమం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కవులు బండవరం రంగనాథ స్వామి, బొల్లావారం జగన్ మోహన్ రావు, జి. మహేందర్, సాగర్, పి.శ్రీనివాస్, బొడ్డు మహేందర్, పి.వేణుగోపాల్ రావు, మేసు మల్లేష్, మేకల రామస్వామి, బెల్లాల సుగుణాకర్ పాల్గొన్నారు.
సంఘ కార్యదర్శి జై కిషన్ ఓఝా, ఉపాధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్,
కోశాధికారి శీలo శ్రీనివాస్ రెడ్డి
పాల్గొన్నారు.
పైడిమర్రి వెంకట్ సుబ్బారావు గారి జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని, అతని పేరుపై తపాల బిళ్ళ.విడుదల చేయాలని కవులు కోరారు.
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల
Wednesday, 29 May 2019
Subscribe to:
Posts (Atom)
















































