Monday, 31 August 2020

" జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం " " రవీంద్ర నాథ్ ఠాగూర్ జీవితం , సాహిత్యం "

 వివిధ సాహితీ సంస్థల

1) దేశభక్తుల సంక్షేమ సంఘం గారు , మంచిర్యాల
2) శరత్ సాహితి కళా స్రవంతి , కరీంనగర్
3) ఉదయ సాహితి , కరీంనగర్
4) భువన సాహిత్య విజ్ఞాన వేదిక , తెలంగాణ
5) ఉట్నూర్ సాహితి వేదిక , ఉట్నూర్
ఆధ్వర్యంలో జరుగనున్న
" జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం "
" రవీంద్ర నాథ్ ఠాగూర్ జీవితం , సాహిత్యం "
సెప్టెంబర్ 6 ,2020 న గూగుల్ మీట్ లో





Tuesday, 25 August 2020

" తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు " అనే అంశంపై " జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం "

 దేశభక్తుల సంక్షేమ సంఘం : తెలంగాణ

Patriots Welfare Society : Telangana
Mancherial ( Regd.no. 446/2014)

జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం

" తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
ప్రజా సంక్షేమ పథకాలు "

దేశభక్తుల సంక్షేమ సంఘం, తెలంగాణ ( మంచిర్యాల) వారు 
" తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు" అనే అంశంపై 
జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం ను September 13, 2020
తేదీన గూగుల్ మీట్ ద్వారా ఉదయం 10.30 నుంచి నిర్వహించదలచారు.

కవి సమ్మేళనం లో పాల్గొనే వారికి ఈ- సర్టిఫికెట్ లు ఇవ్వడం జరుగుతుంది.

ఈ కవి సమ్మేళనం పాల్గొనాలి అనుకునే కవులు
లో ఉన్న గూగుల్ ఫామ్ లో వారి వివరాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్,
 మిషన్ భగీరథ, ఆసరా, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, యంత్ర లక్ష్మీ ,
 ఇంకా అనేకంగా ఉన్న ప్రజా సంక్షేమ పథకాలపై వారి కవితను
 12 నుంచి 16 లైన్లు గూగుల్ ఫామ్ లోనే September 8, 2020 లోపు నింపాలి.


కవితలు రాసిన వారి మెయిల్ కు కవితల స్వీకరణ ముగిసిన తర్వాత
" ప్రశంసా పత్రం వచ్చే గూగుల్ ఫామ్ "
పంపించడం జరుగుతుంది. అందులో వివరాలు నింపితే మీ మెయిల్ కు
 1,2 నిమిషాలలో ప్రశంసా పత్రం వస్తుంది.

గూగుల్ ఫామ్ నింపలేని వారు, మెయిల్ వాడలేని వారు ఇందులో
 పాల్గొనకండి.
పదే పదే మెసేజిలు పెట్టకండి.

ఈ కింది గూగుల్ ఫామ్ లో వివిరాలు నింపండి .


సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
తెలంగాణ ( మంచిర్యాల) 
============================================ 

Tuesday, 11 August 2020

" సాహిత్య విక్రమార్క పురస్కారాల ప్రధానం "

 " సాహిత్య విక్రమార్క పురస్కారాల ప్రధానం "


దేశభక్తుల సంక్షేమ సంఘం , తెలంగాణ ( మంచిర్యాల ) వారు " దేశభక్తి సాహిత్యం" ను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో దేశభక్తి సాహిత్య ఈ పత్రిక పేస్ బుక్ గ్రూప్  ద్వారా  " వారం , వారం కవితా హారం " కార్యక్రమము ను ఏప్రిల్ 12,2020 ను ప్రారంభించడం జరిగింది. ఇందులో అంశాలు అన్ని కూడా దేశభక్తికి చెందినవే అయి ఉంటాయి. 

కవులు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట లోపు వారి దేశభక్తి కవితను ఆన్లైన్ లో గ్రూప్లో చదవాలి .
అలా దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారి " వారం , వారం కవితా హారం " లో 10 ఆదివారాలు  క్రమం తప్పకుండా పాల్గొంటు, నిరంతరం దేశభక్తి సాహిత్యానికి రచిస్తున్న కవులకు మా సంస్థ తరుపున " సాహిత్య విక్రమార్క " పురస్కారాలు " స్వాతంత్ర్య దినోత్సవం 2020 " ను పురస్కరించుకొని  యివ్వడమైనది .

పురస్కారాలు పొందిన వారు
1. డా. రామక కృష్ణ మూర్తి
2 పి .విల్ ఎల్ . సుజాత
3 సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
4 దార స్నేహలత
5 ch .శ్రీనివాస్ రావ్
6 హరిత మాధవీ లతా
7 pv దుర్గా ప్రసాద్ , శ్రీకాకుళం
8 రామగిరి  నరేష్ , ధర్మపురి
9 సామల కిరణ్, కరీంనగర్
10 ఆకుల మల్లికార్జున్ , షాద్ నగర్
11 మోతె రాజ్ కుమార్, వరంగల్
12 ఇమ్మడి రాంబాబు , మెహబూబా బాద్
13 ఆత్రం మోతి రామ్ ఉట్నూర్
14 అయ్యవారు మురళి, కామారెడ్డి
15 ప్రభాశాస్త్రి జ్యోశ్యుల , మైసూర్
16 ఏ . సుబ్రహ్మణ్యం 

పురస్కారాలు పొందిన అందరికి శుభాకాంక్షలు .

యిట్లు

సూదిరెడ్డి  నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం ,
తెలంగాణ ( మంచిర్యాల )

Sunday, 9 August 2020

సాహిత్య విక్రమార్క పురస్కారాలు

వారం వారం కవితా హారం 
" సాహిత్య విక్రమార్క  పురస్కారాల విధివిధానాలు "

1) ఈ పురస్కారాలు " దేశభక్తుల సంక్షేమ సంఘం , తెలంగాణ మంచిర్యాల " ( PATRIOTS WELFARE SOCIETY, TELAGANA, MANCHERIAL ) వారి ఇవ్వడం జరుగుతుంది 
2) కవితలు అన్ని కూడా దేశభక్తికి సంబంధించి ఉండాలి 
3) కవులు కవితలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు " దేశభక్తి సాహిత్య ఈ పత్రిక " పేస్ బుక్ గ్రూప్ లో చదవాలి . ఇది తప్పనిసరి .
4) మీ కవిత ఆడియో, మీ ఫోటో kavisammelanam2020@gmail.com  కు పంపాలి . ఇది తప్పనిసరి కాదు 
5) వచ్చిన కవితలలో స్వరం స్పష్టంగా ఉండాలి 
6) 12 ఆదివారాలు కవితలు చదివిన వారికి పురస్కారాలు డిజిటల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రింట్ తీసుకోవచ్చు.
7) వయసు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి 
8) ఈ కార్యక్రమంనకు తాత్కాలిక విరామం ఇచ్చే అధికారం సంఘానికి గలదు 

సూదిరెడ్డి నరేందర్ రెడ్డి 
అధ్యక్షుడు 
దేశభక్తుల సంక్షేమ సంఘం, తెలంగాణ ( మంచిర్యాల )
మరియు 
అడ్మిన్ 
దేశభక్తి సాహిత్య ఈ పత్రిక  పేస్ బుక్ గ్రూప్ 
తేదీ : 01-08-2020
=============================================