Friday, 12 November 2021

75 years indepdence day poetry book 2021

 



I request you to download 75 years Independence day poetry book from the below link 



=============================================================== 

Thursday, 28 October 2021

జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం

 జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం 


సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని 

ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కవులు ఈ కార్యక్రమం లో 

పాల్గొనగలరు 

తేదీ : అక్టోబర్ 31,2021 ఆదివారం 

ఉదయం 11 గంటల నుంచి 



Friday, 30 July 2021

హై స్కూల్ విద్యార్థులకు " స్వాతంత్ర్య దినోత్సవం"ను పురస్కరించుకుని " జాతీయ స్థాయి దేశభక్తి గీతాల గాన పోటీలు 2021 "

 గీతాలపన పోటీలు

Patriots Welfare Society
Telangana , Mancherial
Read.no 446/2014
హై స్కూల్ విద్యార్థులకు " స్వాతంత్ర్య దినోత్సవం"ను పురస్కరించుకుని
" జాతీయ స్థాయి దేశభక్తి గీతాల గాన పోటీలు 2021 "
జూమ్ ద్వారా ఆన్లైన్ లో
ఆగస్ట్ 15, 2021 ని పురస్కరించుకొని ఆగస్ట్ 8, 2021
ఆదివారం ఉదయం 10 .30 నుంచి , నిర్వహించేవారు : దేశభక్తుల సంక్షేమ సంఘం, తెలంగాణ ( మంచిర్యాల )
1) మొదట నమోదు చేసుకున్న 100 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది.
2) 7,8,9,10 తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చు
3) మా సంస్థ పుస్తకాలు www.patriotswelfaresociety.blogspot.com లో ఉచితంగా గలవు. ఆ పుస్తకాల నుంచి మాత్రమే పాటలు ఎన్నుకోవాలి
4) పాల్గొన్న అందరికి e సర్టిఫికెట్ లు ఇవ్వబడును.
5) ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన విద్యార్థులకు ప్రత్యేక ప్రశంసా పత్రాలు ఇవ్వబడును.
6) నమోదుకు చివరి తేదీ ఆగస్ట్ 5, 2021
ఈ form లో మీ వివరాలు నింపండి.
పాల్గొనదలచిన వారు తప్పనిసరి ఈ కింది వాట్సప్ గ్రూప్ లో చేరాలి.
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
President
Patriots Welfare Society
@@@@@@@@@@@@@@@@@@

Wednesday, 21 July 2021

తెలంగాణ సాహిత్య రథ సారథి దాశరథి ఆన్లైన్ కవి సమ్మేళనం దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల

 జూలై 21,2021

తెలంగాణ సాహిత్య రథ సారథి
దాశరథి
ఆన్లైన్ కవి సమ్మేళనం
దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల

Poetry conference on the Birth anniversary of famous poet and Telangana freedom fighter
Dasharadi Krishnamcharya . This programme is conducted by zoom video conference on july 21,2021. Birth anniversary is on July 22,2021.











#Dasharadikrishnamacharya
#natelanganakotiratnamaveena




Saturday, 19 September 2020

దేశభక్తి సాహిత్య భాస్కర , దేశభక్తి సాహిత్య సేవా భాస్కర బిరుదులు ప్రధానం

 దేశభక్తుల సంక్షేమ సంఘం : తెలంగాణ 

జిల్లా : మంచిర్యాల ( నమోదు సంఖ్య 446/2014)

PATRIOTS WELFARE SOCIETY : TELANGANA

DIST: MANCHERIAL ( Regd.no.446/2014)


" కవులకు " దేశభక్తి  సాహిత్య భాస్కర ,

 సంపాదకులకు " దేశభక్తి సాహిత్య  సేవా భాస్కర " బిరుదులు ప్రధానం "

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ప్రధాన లక్ష్యం  " జాతీయ ఐక్యత, జాతీయ సమైక్యత , జాతీయత, దేశభక్తి " ప్రచారం చేయడం.  ఈ లక్ష్య సాధనలో భాగంగా సంఘం " దేశభక్తి సాహిత్య ఈ పత్రిక " ను అక్టోబర్ 2018 లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి 3 నెలలకు ఒక్కసారి విడుదల అయ్యే ఈ పుస్తకం . ప్రధానంగా దేశభక్తి రచనలు కలిగి ఉంటుంది. 2018 నుంచి ఇప్పటి వరకు " దేశభక్తి సాహిత్య ఈ పత్రిక " కు అనేక మంది కవులు వారి వారి రచనలు నిస్వార్థంతో పంపండి జరిగింది.


వారికి గౌరవం ఇచ్చే ఉద్దేశ్యంతో 10 సంచికలు, 3 ప్రత్యేక సంచికలకు రచనలు పంపిన కవులకు " దేశభక్తి సాహిత్య భాస్కర " బిరుదును ప్రధానం చేస్తున్నాము. వారి పేర్లు 

1) శింగారాజు శ్రీనివాస్ రావ్ , ఒంగోలు 

2) వెంకట లక్ష్మి గాయత్రీ , విజయనగరం 

3) సయ్యద్ జహీర్ అహ్మద్ , కర్నూలు 

4) ఐ .వి. సుబ్బాయమ్మ , లక్షెట్ పెట్ 

5) కొప్పుల ప్రసాద్ , నంద్యాల 

6) ఆత్రం మోతీరాం , ఉట్నూర్ 

7) వురిమళ్ళ సునంద , ఖమ్మం 

8) కుడికాల జనార్దన్ , వరంగల్ 

9) రాంపల్లి శైలజ , హైదరాబాద్ 

10) ఆకుల మల్లికార్జున్ , షాద్ నగర్ 

11) డా. రామాక కృష్ణ మూర్తి,  సికింద్రాబాద్ 

12) డా. వీపూరి వెంకటేశ్వర్లు , కర్నూల్ 

13) కిలపర్తి దాలినాయుడు , విశాఖపట్నం 

14) సందుపట్ల మధు , హన్మకొండ 

15) డా. దేవులపల్లి పద్మజ , విశాఖపట్నం 

16) జక్కు కృష్ణ మూర్తి గౌడ్ , వరంగల్ 

17) దొంతరాజు విజయలక్ష్మి , కరీంనగర్ 

వీరితో పాటు 10 సంచికలకు , ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం వహిస్తున్న వారికి " దేశభక్తి సాహిత్య సేవా భాస్కర " బిరుదులు ప్రధానం చేస్తున్నాము. వారి పేర్లు 

1) సూదిరెడ్డి నరేందర్ రెడ్డి , మంచిర్యాల 

2) జై కిషన్ ఓఝా , మంచిర్యాల 

3) అల్లాడి శ్రీనివాస్ , మంచిర్యాల 

4) డా తన్నీరు సురేష్, ధర్మపురి 

5) దార్శెట్టి  లక్ష్మి నరసింహం , సిర్పూర్ కాగజ్ నగర్ 

6) వింధ్య వాసిని దేవి, హైదరాబాద్ 

7)సందుపట్ల మధు, హన్మకొండ 

8) వీపూరి వెంకటేశ్వర్లు , కర్నూలు 

వారికి బిరుదు పత్రాలు డిజిటల్ రూపంలో యివ్వడం జరుగుతుంది .


సూదిరెడ్డి నరేందర్ రెడ్డి 

అధ్యక్షులు 

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల

Date : 20-09-2020 

======================================================= 


Tuesday, 15 September 2020

PATRIOTS WELFARE SOCIETY , TELAGANA ( MANCHERIAL) - NATIONAL LEVEL ONLINE DRAWING COMPETITION FOR HIGH SCHOOL STUDENTS 2020 - LAST DATE OCTOBER 2,2020 -

 PATRIOTS WELFARE SOCIETY , TELAGANA ( MANCHERIAL) - NATIONAL LEVEL ONLINE DRAWING COMPETITION FOR HIGH SCHOOL AND COLLEGE STUDENTS 2020 - LAST DATE OCTOBER 2,2020 -

 

painting must be on Mahatma Gandhi or his role in Indian independence


1) Students must draw with their own articles 

2) students must mention their name and class, district and state  on their painting 

3) they must upload photograph of painting 

4) only to those students who uploaded drawing, we will sent a certificate form to their mail id. they can  fill form and get certificate

5) There is no cash prize

6) First , second , third drawing are provided with  special appreciation certificates

7) Students all over India can participate

8) We reserve right to use your drawing for our society purposes


S.NARENDAR REDDY 

President

Patriots welfare society, Telangana ( Mancherial)

patriotswelfaresociety@gmail.com


and


Jai Kishan Ojha

General Secretary 


Click below form and fill your data to participate


https://forms.gle/LKLc8V7vbHddW79c7


============================================================== 

జాతిపితకు జేజేలు ఆన్లైన్ కవి సమ్మేళనం కు నమోదు చేసుకోండి

 ఈ జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం నిర్వహణలో పాల్గొంటున్న సాహిత్య సంఘాలు 


1) దేశభక్తుల సంక్షేమ సంఘం , తెలంగాణ 

2) భువన సాహిత్య విజ్ఞాన వేదిక, తెలంగాణ 

3) తెలంగాణ వివేక రచయితల సంఘం , తెలంగాణ 

4) ఉట్నూర్ సాహితీ వేదిక, ఉట్నూర్ 

5) తెలంగాణ సామాజిక రచయితల సంఘం, మహబూబాబాద్ జిల్లా 


జాతిపితకు జేజేలు - జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం అక్టోబర్ 2,2020 న పైన పేర్కొన్న అన్ని సంఘాలు కలిపి 

నిర్వహిస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాము  


ఈ కవి సమ్మేళనం అక్టోబర్ 2,2020 న గూగుల్ మీట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.

పాల్గొనే ఆసక్తి ఉన్న కవులు ఈ ఫామ్ లో వారి వివరాలతో పాటు మహాత్మా గాంధీ గారిపై కవితను కూడా ఇందులో రాయాలి . 


కవి పేరు, కవితా శీర్షిక, కవిత, చిరునామా ఈ క్రమ పద్దతిలో కవిత ఉండాలి. 


పాల్గొన్న కవులకు ఈ -ప్రశంసా పత్రం యివ్వడం జరుగుతుంది. కవిత రాయడంతో పాటు ఆన్లైన్ కవి సమ్మేళనం లో పాల్గొనడం తప్పనిసరి 


ఇట్లు 

సాహిత్య సంఘాల అధ్యక్ష ,కార్యదర్శులు  

========================================================= 


https://docs.google.com/forms/d/e/1FAIpQLScATyKoDbghlCDIyCdjze8LdxQAjtgGtPjP44driCCSSCFPuw/viewform?usp=sf_link


=============================================================== 

Sunday, 6 September 2020

" రవీంద్రనాథ్ టాగోర్ పై జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం నిర్వహణ "

 తేదీ 06-09-2020

దేశభక్తుల సంక్షేమ సంఘం , తెలంగాణ (మంచిర్యాల )

" పత్రిక ప్రకటన "

" రవీంద్రనాథ్ టాగోర్ పై జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం నిర్వహణ "

" రవీంద్రనాథ్ టాగోర్ జీవితం, సాహిత్యం పై " జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం " ను ఐదు సాహితీ సంస్థలు కలిసి నిర్వహించినట్టు కవి సమ్మేళన అధ్యక్షుడు మరియు దేశభక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షలు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు .

ఐదు సాహితీ సంఘాలు 1) దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల 2) శరత్ సాహితీ కళా స్రవంతి , కరీంనగర్ 3) ఉదయ సాహితి , కరీంనగర్ 4) భువన విజ్ఞాన సాహిత్య వేదిక , తెలంగాణ 5) ఉట్నూర్ సాహితి వేదిక, ఉట్నూర్ తలపెట్టిన " రవీంద్రనాథ్ టాగోర్ జయంతి వేడుకలు 2020 " కరోనా కారణంగా రద్దు కావడంతో ఈ ఆన్లైన్ కవి సమ్మేళనం నిర్వహించినట్టు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.

ఈ జాతీయ అంతర్జాల కవి సమ్మేళనం ముఖ్య అతిధిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ శ్రీ దార్ల వెంకటేశ్వర్ రావ్ గారు పాల్గొన్నారు . వారు మాట్లాడుతూ ఠాగూర్ జీవితంపై కవి సమ్మేళనం నిర్వహించడం మంచి కార్యక్రమం అని , కవులు అందరిని కలుపుకు పోయే విశాల వేదిక అవసరం అని పేర్కొన్నారు. 5 సంఘాలు కలిసి కవి సమ్మేళనం నిర్వహించడం గొప్ప కార్యక్రమం అని అభినందించారు.

దేశాన్ని ప్రేమించడం, దేశ భౌగోళిక పరిస్థితులను ప్రేమించడం అనేది చర్చనీయా అంశం అని, అయితే దేశ భౌగోళిక పరిస్థితులను ప్రేమించలేని వారు దేశాన్ని ప్రేమించలేరని తెలిపారు. మన దేశం విస్తృత సాహిత్యం స్పృష్టించిందని రామాయణ, మహాభారతాలు అందులో భాగాలని , ఆ స్థాయిలో మళ్ళి సాహిత్యం ను రవీంద్రనాథ్ ఠాగోర్ గారు స్పృష్టించారని తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలను కలుపుకుపోయే విధంగా రవీంద్రనాథ టాగోర్ గారు రచించిన జాతీయ గీతం " జన,గణ మన " ఉందని అందుకే దానిని జాతీయ గీతంగా ఆమోదించారని తెలిపారు. రవీంద్రనాథ్ టాగోర్ జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని , మాతృ భాషను విస్మరించకుండా పర భాషలు కూడా నేర్చుకోవాలని టాగోర్ జీవితం సూచిస్తున్నాడని తెలిపారు. మనకు ఉండే స్వేచ్ఛ ను యితరులు కోరుకుంటారని రవీంద్రనాథ్ టాగోర్ వారి సాహిత్యంలో సూచించారని తెలిపారు. టాగోర్ రాసిన నవలలో ఘోర నవల ప్రసిద్ధమైనది తెలిపారు. విశాల మానవుడు ఉద్బవించానలి టాగోర్ కోరుకున్నారని, భిన్న భాషలు దేశ సమైక్యతకు అవసరం అని వారు తెలిపారు. మాధుర్యం కవిత్వానికి ముఖ్యమని, కవిత్వంలో కవిత్వం మాత్రమే కనిపించాలని కవి కాదని అన్నారు. సంస్కృతీ అంటే ఎప్పటికప్పుడు సంస్కరించేబడేదని టాగోర్ పేర్కొన్నారని తెలిపారు.

ఈ కవి సమ్మేళనం కు విశిష్ట అతిధిగా ఢిల్లీ విశ్వవిద్యాలయం కు చెందిన డా. గంపా వెంకట రామయ్య గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ టాగోర్ సాహిత్యం గురించి మాట్లాడాలంటే అంత పరిజ్ఞానం ఉండాలని, కానీ సాహిత్య విద్యార్థిగా రవీంద్రుని కవితాలపై చర్చిస్తున్నాని తెలిపారు. రవీంద్రనాథ్ టాగోర్ రచనలు చాలా వరకు తెలుగులోకి అనువదించబడ్డాయని తెలిపారు. విశ్వసాహిత్యం, నేషనలిజం పేరుతొ వచ్చిన రెండు పత్రాలపై వారు మాట్లాడారు. విశ్వ సాహిత్యం విశ్వ శ్రేయస్సు ను కోరుతుందని, అది మాత్రమే సాహిత్యం అని పేర్కొన్నారు. ఈ భూభాగం ప్రపంచం అంతా కలిసి ఉన్న ఉన్న భాగమని ముక్కలు, ముక్కలు అయిన భాగం కాదని టాగోర్ అనే వారిని తెలిపారు. విశ్వసాహిత్యానికి అనువాదం చేయదగ్గ అర్హత, మరియు ప్రాంతానికి, కాలానికి అతీతంగా ఉండే అర్హత ఉండాలని తెలిపారు.

ఈ కవి సమ్మేళన గౌరవ అతిధులుగా సబ్బాని లక్ష్మి నారాయణ ( కరీంనగర్ ) , వైరాగ్యం ప్రభాకర్ ( కరీంనగర్ ) , గోస్కుల రమేష్ ( హుజురాబాద్ ) , జాదవ్ బంకట్ లాల్ ( ఉట్నూర్ ) వ్యవహరించారు.

ఆత్మీయ అతిధులుగా జై కిషన్ ఓఝా ( మంచిర్యాల ) , సంకెపల్లి నాగేంద్ర శర్మ ( కరీంనగర్ ), బి వి యెన్ శర్మ ( కరీంనగర్ ), మంచికట్ల శ్రీనివాస్ ( వరంగల్ ), కొండగుర్ల లక్ష్మయ్య ( ఉట్నూర్ ) వ్యవహరించారు.

ప్రత్యేక అతిధిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని కి చెందిన తెలుగు విభాగం అధిపతి తన్నీరు సురేష్ గారు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా కవులు పాల్గొన్నారు.

సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

అధ్యక్షుడు

దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల















Monday, 31 August 2020

" జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం " " రవీంద్ర నాథ్ ఠాగూర్ జీవితం , సాహిత్యం "

 వివిధ సాహితీ సంస్థల

1) దేశభక్తుల సంక్షేమ సంఘం గారు , మంచిర్యాల
2) శరత్ సాహితి కళా స్రవంతి , కరీంనగర్
3) ఉదయ సాహితి , కరీంనగర్
4) భువన సాహిత్య విజ్ఞాన వేదిక , తెలంగాణ
5) ఉట్నూర్ సాహితి వేదిక , ఉట్నూర్
ఆధ్వర్యంలో జరుగనున్న
" జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం "
" రవీంద్ర నాథ్ ఠాగూర్ జీవితం , సాహిత్యం "
సెప్టెంబర్ 6 ,2020 న గూగుల్ మీట్ లో





Tuesday, 25 August 2020

" తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు " అనే అంశంపై " జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం "

 దేశభక్తుల సంక్షేమ సంఘం : తెలంగాణ

Patriots Welfare Society : Telangana
Mancherial ( Regd.no. 446/2014)

జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం

" తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
ప్రజా సంక్షేమ పథకాలు "

దేశభక్తుల సంక్షేమ సంఘం, తెలంగాణ ( మంచిర్యాల) వారు 
" తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు" అనే అంశంపై 
జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం ను September 13, 2020
తేదీన గూగుల్ మీట్ ద్వారా ఉదయం 10.30 నుంచి నిర్వహించదలచారు.

కవి సమ్మేళనం లో పాల్గొనే వారికి ఈ- సర్టిఫికెట్ లు ఇవ్వడం జరుగుతుంది.

ఈ కవి సమ్మేళనం పాల్గొనాలి అనుకునే కవులు
లో ఉన్న గూగుల్ ఫామ్ లో వారి వివరాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్,
 మిషన్ భగీరథ, ఆసరా, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, యంత్ర లక్ష్మీ ,
 ఇంకా అనేకంగా ఉన్న ప్రజా సంక్షేమ పథకాలపై వారి కవితను
 12 నుంచి 16 లైన్లు గూగుల్ ఫామ్ లోనే September 8, 2020 లోపు నింపాలి.


కవితలు రాసిన వారి మెయిల్ కు కవితల స్వీకరణ ముగిసిన తర్వాత
" ప్రశంసా పత్రం వచ్చే గూగుల్ ఫామ్ "
పంపించడం జరుగుతుంది. అందులో వివరాలు నింపితే మీ మెయిల్ కు
 1,2 నిమిషాలలో ప్రశంసా పత్రం వస్తుంది.

గూగుల్ ఫామ్ నింపలేని వారు, మెయిల్ వాడలేని వారు ఇందులో
 పాల్గొనకండి.
పదే పదే మెసేజిలు పెట్టకండి.

ఈ కింది గూగుల్ ఫామ్ లో వివిరాలు నింపండి .


సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
తెలంగాణ ( మంచిర్యాల) 
============================================ 

Tuesday, 11 August 2020

" సాహిత్య విక్రమార్క పురస్కారాల ప్రధానం "

 " సాహిత్య విక్రమార్క పురస్కారాల ప్రధానం "


దేశభక్తుల సంక్షేమ సంఘం , తెలంగాణ ( మంచిర్యాల ) వారు " దేశభక్తి సాహిత్యం" ను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో దేశభక్తి సాహిత్య ఈ పత్రిక పేస్ బుక్ గ్రూప్  ద్వారా  " వారం , వారం కవితా హారం " కార్యక్రమము ను ఏప్రిల్ 12,2020 ను ప్రారంభించడం జరిగింది. ఇందులో అంశాలు అన్ని కూడా దేశభక్తికి చెందినవే అయి ఉంటాయి. 

కవులు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట లోపు వారి దేశభక్తి కవితను ఆన్లైన్ లో గ్రూప్లో చదవాలి .
అలా దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారి " వారం , వారం కవితా హారం " లో 10 ఆదివారాలు  క్రమం తప్పకుండా పాల్గొంటు, నిరంతరం దేశభక్తి సాహిత్యానికి రచిస్తున్న కవులకు మా సంస్థ తరుపున " సాహిత్య విక్రమార్క " పురస్కారాలు " స్వాతంత్ర్య దినోత్సవం 2020 " ను పురస్కరించుకొని  యివ్వడమైనది .

పురస్కారాలు పొందిన వారు
1. డా. రామక కృష్ణ మూర్తి
2 పి .విల్ ఎల్ . సుజాత
3 సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
4 దార స్నేహలత
5 ch .శ్రీనివాస్ రావ్
6 హరిత మాధవీ లతా
7 pv దుర్గా ప్రసాద్ , శ్రీకాకుళం
8 రామగిరి  నరేష్ , ధర్మపురి
9 సామల కిరణ్, కరీంనగర్
10 ఆకుల మల్లికార్జున్ , షాద్ నగర్
11 మోతె రాజ్ కుమార్, వరంగల్
12 ఇమ్మడి రాంబాబు , మెహబూబా బాద్
13 ఆత్రం మోతి రామ్ ఉట్నూర్
14 అయ్యవారు మురళి, కామారెడ్డి
15 ప్రభాశాస్త్రి జ్యోశ్యుల , మైసూర్
16 ఏ . సుబ్రహ్మణ్యం 

పురస్కారాలు పొందిన అందరికి శుభాకాంక్షలు .

యిట్లు

సూదిరెడ్డి  నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం ,
తెలంగాణ ( మంచిర్యాల )

Sunday, 9 August 2020

సాహిత్య విక్రమార్క పురస్కారాలు

వారం వారం కవితా హారం 
" సాహిత్య విక్రమార్క  పురస్కారాల విధివిధానాలు "

1) ఈ పురస్కారాలు " దేశభక్తుల సంక్షేమ సంఘం , తెలంగాణ మంచిర్యాల " ( PATRIOTS WELFARE SOCIETY, TELAGANA, MANCHERIAL ) వారి ఇవ్వడం జరుగుతుంది 
2) కవితలు అన్ని కూడా దేశభక్తికి సంబంధించి ఉండాలి 
3) కవులు కవితలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు " దేశభక్తి సాహిత్య ఈ పత్రిక " పేస్ బుక్ గ్రూప్ లో చదవాలి . ఇది తప్పనిసరి .
4) మీ కవిత ఆడియో, మీ ఫోటో kavisammelanam2020@gmail.com  కు పంపాలి . ఇది తప్పనిసరి కాదు 
5) వచ్చిన కవితలలో స్వరం స్పష్టంగా ఉండాలి 
6) 12 ఆదివారాలు కవితలు చదివిన వారికి పురస్కారాలు డిజిటల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రింట్ తీసుకోవచ్చు.
7) వయసు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి 
8) ఈ కార్యక్రమంనకు తాత్కాలిక విరామం ఇచ్చే అధికారం సంఘానికి గలదు 

సూదిరెడ్డి నరేందర్ రెడ్డి 
అధ్యక్షుడు 
దేశభక్తుల సంక్షేమ సంఘం, తెలంగాణ ( మంచిర్యాల )
మరియు 
అడ్మిన్ 
దేశభక్తి సాహిత్య ఈ పత్రిక  పేస్ బుక్ గ్రూప్ 
తేదీ : 01-08-2020
=============================================

Thursday, 2 April 2020

E BOOK ON CORONA VIRUS MARCH 2020

DOWN LOAD FROM BELOW LINK 

" E BOOK ON CORONA VIRUS " 

KABALISTUNNA KARONA 



=====================================================================

Saturday, 7 March 2020

దేశభక్తీ సాహిత్య ఈ పత్రిక 6 వ సంచిక - మువ్వన్నెల జెండా గీతాలు, కవితలు




=================================================

దేశభక్తీ సాహిత్య ఈ పత్రిక 6 వ సంచిక - మువ్వన్నెల జెండా గీతాలు, కవితలు







=====================================================================



Tuesday, 29 October 2019

SARDAR VALLABAI PATEL JAYANTHI 2019

పత్రిక ప్రకటన
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
ఈ రోజు దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆద్వర్యంలో ముందస్తుగా సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి ( జయంతి అక్టోబర్ 31) ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా వచ్చిన గోదావరిఖని ప్రభుత్వ డిగ్రి కళాశాల ఆసిస్టెంట్ ప్రొపెసర్ డా. తన్నీరు సురేష్ గారు భారత దేశానికి సర్దార్ వల్లబాయ్ పటేల్ అందించిన సేవలు వివరించారు. భారతదేశ భౌగోళిక సమైక్యత కి వారు చేసిన కృషి గొప్పదని కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన సంస్థ అధ్యక్షులు శ్రీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ నాయకులలో ఉక్కుమనిషి గా పేరు తెచ్చుకొని యువతకుఅదర్శంగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు అడ్వాకేట్ మంచిర్యాల రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ బొడ్డు మహేందర్ గారు కార్యదర్శి శ్రీ మేకల రామస్వామి గారు ప్రముఖ కవులు బెల్లాల సుగుణాకర్ పెంచాల శ్రీనివాస్ అల్లాడి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కొనియాడుతూ కవి సమ్మేళనం నిర్వహించారు.
కార్యక్రమంలో ఫిబ్రవరి 2019 న నిర్వహించిన జాతీయ స్థాయి కవి సమ్మేళనం లో వచ్చిన
54 కవితలతో కూడిన " స్వాతంత్య్ర భారతికి సాహిత్య హరతి" ఈ పుస్తకం ముఖ్య అతిధి , డా.తన్నీరు సురేశ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు శీలo శ్రీనివాస్ రెడ్డి, ఓఝా పాల్గొన్నారు.
ఇట్లు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల





Wednesday, 2 October 2019

JATIPITA MAHATMA GANDHI 150 BIRTH ANNIVERSARY AND LAL BAHADUR SHASTRI BIRTH ANNIVERSARY

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
పత్రిక ప్రకటన
తేదీ : అక్టోబర్ 2, 2019
"జాతిపిత మహాత్మా గాంధీ 150 జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు "
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఈ రోజు మహాత్మా గాంధీ 150 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంను పురస్కరించుకుని మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పించారు. అదే విధంగా ఈ రోజు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినమును పురస్కరించుకుని వారి చిత్ర పటానికి కూడా పూలమాల తో ఘన నివాళ్ళు అర్పించారు.
తదుపరి
" మహాత్ముడే మానవాళికి మార్గ దర్శకుడు "
అనే అంశంపై కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనం ప్రారంభ ఉపాన్యాసం చేసిన సంఘ అధ్యక్షుడు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్ముని అహింసా, సత్యాగ్రహాలు ఎప్పటికైనా ఆచరణీయమేనని పేర్కొన్నారు. విప్లవ, అతివాద భావజాలం కూడా కరుడుగట్టిన బ్రిటిష్ వారిని వణికించలేక పొయిందని కానీ మహాత్ముని సత్యాగ్రహ ఉద్యమం బ్రిటిష్ వారిని భారత దేశం విడిచి వెళ్లేలా చేసిందని దానికి కారణం గాంధీజీని దేశప్రజలు అందరూ అనుసరించడమేనని.
నాయకుని లక్షణం ప్రజల నుంచి రావడం, ప్రజల కొరకు పని చేయడమేనని తెలిపారు.
నేటి రాజకీయ వ్యవస్థ, ఉద్యమకారులు మహాత్ముని అహింసా సిద్ధాంతం గూర్చి తెలుసుకోవలసింది ఎంతో ఉందని పేర్కొన్నారు.
తర్వాత ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా వచ్చిన గుండేటి యోగేశ్వర్ గారు పాల్గొని మహాత్మ గాంధీ ఆశయాలను, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ లాంటి అంశాల గురించి విరివిగా ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో కవులు బండవరం రంగనాథ స్వామి, రాజేశం గౌడ్, మేసు మల్లేశం, పోటు హైమవతి, అల్లాడి శ్రీనివాస్, పిస్క సత్యనారాయణ గారు, బెల్లాల సుగుణాకర్ గారు,సంఘ కార్యవర్గ సభ్యులు మేడ తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల
( ఫొటోలో కనిపించే సంచులు ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ ప్రేమికుడు గుండేటి యోగేశ్వర్ కి చెందినవి. వారు స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడడమే కాకుండా ప్లాస్టిక్ బదులు సంచులు వాడాలని తెలిపారు)







Friday, 20 September 2019

" తెలంగాణ విలీన వీరులకు, విమోచన వీరులకు జన జోహార్లు " మంచిర్యాల జిల్లా కవి సమ్మేళనం

SEPTEMBER 17 ను పురస్కరించుకొని
" తెలంగాణ విలీన వీరులకు, విమోచన వీరులకు జన జోహార్లు "
పేరుతొ మంచిర్యాల జిల్లా స్తాయి కవి సమ్మేళనం
తేది : 14-09-20 19