Monday 18 March 2019

దేశభక్తి సాహిత్య పత్రిక విధి విధానాలు


PATRIOTS WELFARE SOCIETY, MANCHERIAL
Dist: MANCHERIAL, Telangana State, India
(Regd.no.446/2014)
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
“దేశభక్తి సాహిత్య ఈ పత్రిక ” 
తేది: October 1,2018
కనుమరుగు అవుతున్న దేశభక్తికి  పునరుత్తేజం కలిగిoచాలనే ఉద్దేశంతో మా దేశభక్తి ఈ పత్రికను ప్రారంభించాము . చరిత్ర అధ్యాపకులకు మా ప్రత్యేక  విన్నపం ఏమిటంటే మీరు మీ వంతుగా జాతీయోద్యమ నాయకుల గురించి గాని, జాతీయోద్యమ సంఘటనల గురించి గాని మీరు గాని, మీ విద్యార్ధుల చేత గాని రాయించి మా పత్రికకు పంపించ గలరు . తద్వారా మా ప్రయత్నానికి మీ సహకారం యిచ్చిన వారు అవుతారు.

“ దేశభక్తి సాహిత్య ఈ-పత్రిక ”
డిసెంబర్ 12,2018 నాటికి మా సంఘం ను స్థాపించి 4 సంవత్సరాలు కావస్తోంది. ఈ సదర్భంను పురస్కరించుకొని మరియు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ రకమైన ఆర్దిక సహాయం అందడం లేదు అనే చేదు నిజంను గ్రహించి ఒక “ ఈ త్రైమాసిక పత్రిక ” ప్రారంభించాలి అనుకుంటున్నాము. ఆ పత్రిక పేరు “ దేశభక్తి సాహిత్య ఈ పత్రిక ”

 వ్యాసాలు ఈ క్రింది అంశాలకు సంబంధించి ఉండాలి
౧. స్వాతంత్ర సమర యోధుల ఆశయాలు, ఆదర్శాలు, వారి జీవితం, పోరాట విషయాలు
౨.సైనికుల వీరోచిత త్యాగాలు, వారి వీర గాధలు
౩.మహాత్మా గాంధీ సిద్ధాoతాలు, సత్యాగ్రహం, అహింస
4. పండిట్ జవహర్ లాల్ నెహ్రు ఆలోచన విధానం
5. భారత జాతి ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు, సంస్థానాల విలీనం మరియు భారత జాతి ఐక్యత కు బాబా సాహెబ్ అంబేద్కర్ అద్యక్షతన రూపొందిన రాజ్యాంగం చేసే కృషి
6. సుభాస్  చంద్ర బోస్ సైనిక విధానాలు
7. భగత్ సింగ్ , చంద్ర శేఖర్ ఆజాద్ మొదలైన విప్లవ వీరుల ఆలోచనలు, ఆదర్శాలు
8. లాల్, పాల్, బాల్ అతివాదత్రయం వారి పోరాటాలు
9. స్వాతంత్ర పోరాటంలో తెలుగు నాయకుల పాత్ర, వారి చరిత్ర, వారి వీరోచిత పోరాటాలు
10. తెలంగాణ విమోచన పోరాటం
11. మత సామరస్యమే భారతీయుల మతం
12. భారత దేశ సర్వతోముఖాభివృద్ధికి హిందూ, ముస్లింల ఐక్యత అత్యంత ఆవశ్యకం
13. భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వివిధ సంఘాలు , వాటి పాత్ర
14.భారత స్వాతంత్ర సంగ్రామంలో స్త్రీలు, వారి నిరుపమాన పాత్ర
15.భారత మాత, భాగ్య విధాత
16. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన రక్షణ, ఆర్దిక, రాజకీయ , సామాజిక సమస్యలు , పరిష్కార మార్గాలు.
17. మతమా, దేశమా
18 . దేశభక్తిని ప్రేరేపించే మరే అంశం అయినా
విధివిధానాలు :
౧.)ఇది ప్రముఖంగా త్రై మాసిక ఈ పత్రిక
౨) కాలెండర్  సంవత్సరం ను ఆధారంగా చేసుకుంటుంది.
౩) మొదటి  త్రై మాసికం – జనవరి, ఫిబ్రవరి, మార్చి.
రెండవ  త్రై మాసికం  - ఏప్రిల్, మే, జూన్
మూడవ  త్రై మాసికం – జూలై, ఆగష్టు, సెప్టెంబర్ 
నాలుగవ  త్రై మాసికం – అక్టోబర్ , నవంబర్ , డిసెంబర్
4) ప్రతి త్రై మాసికంలో మొదటి మాసంలో రచనలు పంపాలి, రెండవ మాసంలో పరిశీలన, మూడవ మాసంలో ముద్రణ వుంటాయి
5) ఈ పత్రికలో ముద్రితమైన రచనల హక్కులు రచయితలకు సొంతం. మా సంస్థకు ముద్రిత హక్కులు మాత్రం వుంటాయి. వాటికి కాలదోషం ఉండదు.
6) ప్రభుత్వాలను విమర్శించే రచనలు, కుల, మత విద్వేషాలు ప్రేరేపించే రచనలు ముద్రించబడవు . ఈ పత్రిక ప్రధాన ఉద్దేశం సమాజంను ప్రస్తుతం “ ఉన్న ” స్టితి నుంచి మరింత “ ఉన్నత ”స్థితికి తీసుకురావడం. అందువల్ల ఈ ప్రధాన లక్ష్యానికి విరుద్ధంగా ఉన్న రచనలు ముద్రించబడవు.
7) పరుష పదజాలం వాడ రాదు.
8) మేజర్లు అయినా ప్రతి ఒక్కరికి రాసే అవకాశం వుంటుంది.
9) ప్రతి రచనతో రచయితా పేరు, పూర్తీ చిరునామా, మెయిల్ ఐ డి పంపాలి
10) రచనలు సొంత రచన అని హామీ ఇవ్వాలి
11) మాకు పంపిన రచనలు ముద్రించడం మా విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది
12) ఈ పత్రికపై వివాదాలు రావు అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే వివాదాస్పద అంశాలు ముందే తొలగించబడతాయి. అయినా వివాదాలు మంచిర్యాల న్యాయస్థానంల పరిధిలోకి వస్తాయి.
13) పద్య కవిత్వం A 4 సైజు పేజిలో ౩ వంతు ఉండాలి, వచన కవిత్వం, గీతాలు A 4 సైజు పేజి ఉండవచ్చు. కథలు, వ్యాసాలు  2 A 4 సైజు పేజీలు ఉండవచ్చు.
టెక్నికల్ అంశాలు :
౧) రచనలు MS WORD లో పంపాలి లేదా మెయిల్ లో నేరుగా టైపు చేసి పంపవచ్చు
౨) A 4 సైజు పేజిలో అన్ని వైపులా 1 మార్జిన్ వదిలి టైప్ చెయ్యాలి
౩) రచనలు UNIFONT లోనే ఉండాలి
4) రచయితలు తెలుగు బాష  అభ్యర్ధులు  అయితే ఒకటికి రెండు సార్లు PROOF READ చేసి పంపాలి , తెలుగు బాష  అభ్యర్ధులు కాకపొతే తెలుగు బాష  అభ్యర్ధులతో  ప్రూఫ్ రీడ్ చేసిన తర్వాత మాత్రమే   పంపాలి.
5) రచనలు మా ఈ మెయిల్ ఐ డి కి మాత్రమే పంపాలి
6) త్రై మాసికం లోని మెదటి మాసంలో మాత్రమే రచనలు పంపాలి. తర్వాత, ముందు పంపిన రచనలు అంగీకరించబడవు 


ప్రకటన జారి చేసిన వారు
సూది రెడ్డి నరేందర్ రెడ్డి
అద్యక్షులు
దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల

అదనపు అంశాలు
౧. రచనలు యునిఫాంట్ లోనే పంపాలి
౨. కవితలు, గీతాలు 20 -25 లైన్లు ఉండాలి. వ్యాసాలు ౩ పేజీల వరకు ఉండవచ్చు.
౩. ఒక రచయితకు ఒక రచన మాత్రమే సంచికలో ముద్రించబడుతుంది.
4. రచన, రచయిత పోటో , ఇంటి నెంబర్, పిన్ కోడ్, సెల్ నెంబర్ తో కూడిక చిరునామా వివరాలు ఒకేసారి మెయిల్ కు పంపాలి. ఒక సారి రచన, ఒక సారి పోటో, ఒకసారి అడ్రస్ పంపరాదు. మెయిల్ ఐ.డి.

5. రచనలు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలలో మాత్రమే పంపాలి. ఆ నెలలలో ఒకటవ తేది నుంచి చివరి తేది వరకు వచ్చిన రచనలు మాత్రమే పరిశిలించబడుతాయి.
6. ఒక సంచికకు గరిష్ట పేజీలు 100 మాత్రమే .
================================================================

Saturday 9 March 2019

PATRIOTIC LITERARY E-PAPER ( JANUARY -MARCH 2019 ) RELEASE

ప్రభుత్వ డిగ్రీ కళాశాల , లక్షెట్టిపేట లో జరిగిన భారత దేశ ఔన్నత్యాన్ని శ్లాఘిద్దాం కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ జై కిషన్ ఓజా గారు " దేశభక్తి సాహిత్య ఈ పత్రిక " జనవరి - మర్చి 20 19 త్రైమాసికం ను విడుదల చేసారు.
ఆ దృశ్యాలు



Paid homage to solidiers

On February 17, 2019

Our society members paid homage to Indian Soldiers Martyred in Pulwama Attack on February 14,2019