Tuesday 29 October 2019

SARDAR VALLABAI PATEL JAYANTHI 2019

పత్రిక ప్రకటన
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
ఈ రోజు దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆద్వర్యంలో ముందస్తుగా సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి ( జయంతి అక్టోబర్ 31) ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా వచ్చిన గోదావరిఖని ప్రభుత్వ డిగ్రి కళాశాల ఆసిస్టెంట్ ప్రొపెసర్ డా. తన్నీరు సురేష్ గారు భారత దేశానికి సర్దార్ వల్లబాయ్ పటేల్ అందించిన సేవలు వివరించారు. భారతదేశ భౌగోళిక సమైక్యత కి వారు చేసిన కృషి గొప్పదని కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన సంస్థ అధ్యక్షులు శ్రీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ నాయకులలో ఉక్కుమనిషి గా పేరు తెచ్చుకొని యువతకుఅదర్శంగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు అడ్వాకేట్ మంచిర్యాల రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ బొడ్డు మహేందర్ గారు కార్యదర్శి శ్రీ మేకల రామస్వామి గారు ప్రముఖ కవులు బెల్లాల సుగుణాకర్ పెంచాల శ్రీనివాస్ అల్లాడి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కొనియాడుతూ కవి సమ్మేళనం నిర్వహించారు.
కార్యక్రమంలో ఫిబ్రవరి 2019 న నిర్వహించిన జాతీయ స్థాయి కవి సమ్మేళనం లో వచ్చిన
54 కవితలతో కూడిన " స్వాతంత్య్ర భారతికి సాహిత్య హరతి" ఈ పుస్తకం ముఖ్య అతిధి , డా.తన్నీరు సురేశ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు శీలo శ్రీనివాస్ రెడ్డి, ఓఝా పాల్గొన్నారు.
ఇట్లు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల





Wednesday 2 October 2019

JATIPITA MAHATMA GANDHI 150 BIRTH ANNIVERSARY AND LAL BAHADUR SHASTRI BIRTH ANNIVERSARY

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
పత్రిక ప్రకటన
తేదీ : అక్టోబర్ 2, 2019
"జాతిపిత మహాత్మా గాంధీ 150 జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు "
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఈ రోజు మహాత్మా గాంధీ 150 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంను పురస్కరించుకుని మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పించారు. అదే విధంగా ఈ రోజు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినమును పురస్కరించుకుని వారి చిత్ర పటానికి కూడా పూలమాల తో ఘన నివాళ్ళు అర్పించారు.
తదుపరి
" మహాత్ముడే మానవాళికి మార్గ దర్శకుడు "
అనే అంశంపై కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనం ప్రారంభ ఉపాన్యాసం చేసిన సంఘ అధ్యక్షుడు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్ముని అహింసా, సత్యాగ్రహాలు ఎప్పటికైనా ఆచరణీయమేనని పేర్కొన్నారు. విప్లవ, అతివాద భావజాలం కూడా కరుడుగట్టిన బ్రిటిష్ వారిని వణికించలేక పొయిందని కానీ మహాత్ముని సత్యాగ్రహ ఉద్యమం బ్రిటిష్ వారిని భారత దేశం విడిచి వెళ్లేలా చేసిందని దానికి కారణం గాంధీజీని దేశప్రజలు అందరూ అనుసరించడమేనని.
నాయకుని లక్షణం ప్రజల నుంచి రావడం, ప్రజల కొరకు పని చేయడమేనని తెలిపారు.
నేటి రాజకీయ వ్యవస్థ, ఉద్యమకారులు మహాత్ముని అహింసా సిద్ధాంతం గూర్చి తెలుసుకోవలసింది ఎంతో ఉందని పేర్కొన్నారు.
తర్వాత ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా వచ్చిన గుండేటి యోగేశ్వర్ గారు పాల్గొని మహాత్మ గాంధీ ఆశయాలను, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ లాంటి అంశాల గురించి విరివిగా ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో కవులు బండవరం రంగనాథ స్వామి, రాజేశం గౌడ్, మేసు మల్లేశం, పోటు హైమవతి, అల్లాడి శ్రీనివాస్, పిస్క సత్యనారాయణ గారు, బెల్లాల సుగుణాకర్ గారు,సంఘ కార్యవర్గ సభ్యులు మేడ తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల
( ఫొటోలో కనిపించే సంచులు ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ ప్రేమికుడు గుండేటి యోగేశ్వర్ కి చెందినవి. వారు స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడడమే కాకుండా ప్లాస్టిక్ బదులు సంచులు వాడాలని తెలిపారు)