Monday 10 June 2019

SHRI PADIMARRI VENKATA SUBBA RAO BIRTH ANNIVERSARY

పత్రిక ప్రకటన. ( తేదీ : జూన్ 9, 2019)
" భారత దేశం నా మాతృభూమి " ప్రతిజ్ఞ రచించిన తెలంగాణ వాసి పైడిమర్రి వెంకట సుబ్బారావు ను స్మరించుకున్న కవులు, ఉపాధ్యాయులు
జూన్ 10 న ప్రతిజ్ఞ రచయిత శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని ఈ రోజు దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమ సభను ఉద్దేశించి ప్రారంభ ప్రసంగం చేసిన సంఘ అధ్యక్షులు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ భారత దేశంలో జనగణమన, వందేమాతరం తర్వాత జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ గల్గినది ప్రతిజ్ఞ అని గుర్తు చేశారు. అటువంటి ప్రతిజ్ఞను రచించిన తెలంగాణ వాసి, నల్గొండ నివాసి తెలంగాణ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసారని పేర్కొన్నారు.
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు అప్పటి హైద్రాబాద్ రాష్ట్రంలో STO గా విధులు నిర్వహించారు. 1962 చైనా యుద్ధం సమయంలో విశాఖపట్నం లో విధులు నిరహిస్తున్నప్పుడు ప్రతిజ్ఞ రచించారు. దానిని కవి మిత్రులు తెన్నేటి విశ్వనాథం కు చూపించారు. వారి నుంచి విద్యాశాఖ మంత్రి Pv రాజు ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి చేరింది. 1963 లో పాఠ్య పుస్తకాలలో ప్రతిజ్ఞ అచ్చు అయింది. 1965 లో కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను ఆంగ్లంలో కి అనువదించి పాఠ్య పుస్తకాలలో ముద్రించింది. కానీ ఎక్కడ రచయిత పేరు ముద్రించలేదు
2015 లో తెలంగాణ ప్రభుత్వం రచయిత పేరును పాఠ్య పుస్తకాలలో ముద్రించింది. పైడిమర్రి మంచి రచయిత, బహుభాషావేత్త.ఆయన కాలభైరవుడు నవల, దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు లాంటి పద్యకావ్యాలు, బ్రహ్మచర్యం, గృహస్త జీవితం, స్త్రీ ధర్మం, తార, శ్రీమతి అనే నాటికలు రాసారు. వీరి పద్యాలు నల్గొండ కవుల సంచికలో ప్రచురితమైనవి. పైడిమర్రి 1971లో పదవి విరమణ పొంది ఆగస్ట్ 13, 1988 న మరణించారు.
కార్యక్రమం ముఖ్య అతిధిగా మంచిర్యాల రచయితల సంఘం అధ్యక్షుడు బొడ్డు మహేందర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ జాతీయ ప్రతిజ్ఞ ప్రజలలో దేశభక్తి ని పెంచుతుందని, అది రాసిన పైడిమర్రి సుబ్బారావు గారి జయంతి నిర్వహించడం చాల మంచి కార్యక్రమం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కవులు బండవరం రంగనాథ స్వామి, బొల్లావారం జగన్ మోహన్ రావు, జి. మహేందర్, సాగర్, పి.శ్రీనివాస్, బొడ్డు మహేందర్, పి.వేణుగోపాల్ రావు, మేసు మల్లేష్, మేకల రామస్వామి, బెల్లాల సుగుణాకర్ పాల్గొన్నారు.
సంఘ కార్యదర్శి జై కిషన్ ఓఝా, ఉపాధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్,
కోశాధికారి శీలo శ్రీనివాస్ రెడ్డి
పాల్గొన్నారు.

పైడిమర్రి వెంకట్ సుబ్బారావు గారి జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని, అతని పేరుపై తపాల బిళ్ళ.విడుదల చేయాలని కవులు కోరారు.
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల